ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి
ముఖ్యంశాలు
సింగిల్ గర్ల్ చైల్డ్ మెరిట్ స్కాలర్‌షిప్ 2024: నెలకు రూ.1000, ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి
Single Girl Child merit Scholorship Scheme: పేద విద్యార్థినుల కోసం వారి చదుకు కొనసాగించడానికి ప్రభుత్వం కీలక పథకాలను ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలో సింగిల్ గర్ల్ చైల్డ్ మెరిట్ స్కాలర్‌షిప్ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం ద్వారా పదో తరగతి పూర్తి చేసిన సింగిల్ గర్ల్ విద్యార్థినులు నెలకు రూ.1000 చొప్పున రెండు సంవత్సరాల పాటు స్కాలర్‌షిప్ పొందే అవకాశం ఉంది. పేద విద్యార్థినులను చదువుల్లో ముందుకు తీసుకురావడం, వారి భవిష్యత్‌ను వెలుగులమయం చేయడమే ఈ పథక ప్రధాన లక్ష్యం.
ఈ స్కీమ్ ప్రత్యేకంగా సింగిల్ గర్ల్ విద్యార్థినుల కోసం రూపొందించబడింది. సీబీఎస్‌ఈ పాఠశాలల్లో పదో తరగతి పాస్ అయిన విద్యార్థినులకు నెలకు రూ.1000 చొప్పున స్కాలర్‌షిప్ అందించబడుతుంది. దీని గడువు మొత్తం రెండు సంవత్సరాలుగా నిర్ణయించారు.
Single Girl Child merit Scholorship Scheme – అర్హతలు
- విద్యార్థిని సీబీఎస్‌ఈ పదో తరగతి 70% లేదా అంతకంటే ఎక్కువ మార్కులతో పాస్ కావాలి.
- విద్యార్థిని 11వ తరగతి లేదా 12వ తరగతి చదువుతూ ఉండాలి.
- తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.8 లక్షల లోపు ఉండాలి.
Single Girl Child merit Scholorship Scheme – రెన్యువల్ వివరాలు
స్కాలర్‌షిప్ కొనసాగించాలంటే విద్యార్థిని 11వ తరగతి తర్వాత కనీసం 70% మార్కులు సాధించి 12వ తరగతికి చేరాలి.
Single Girl Child merit Scholorship Scheme – దరఖాస్తు విధానం
- స్కాలర్‌షిప్ దరఖాస్తు ఆన్లైన్‌లో అందుబాటులో ఉంది.
- దరఖాస్తు చివరి తేదీ జనవరి 10, 2024.
- అవసరమైన ధృవీకరణ పత్రాలు సమర్పించి, స్కాలర్‌షిప్ కోసం అప్లై చేయవచ్చు.
ముఖ్యమైన తేదీలు
వివరాలు | తేదీ |
---|---|
దరఖాస్తు ప్రారంభం | డిసెంబర్ 1, 2023 |
దరఖాస్తు చివరి తేదీ | జనవరి 10, 2024 |
సింగిల్ గర్ల్ చైల్డ్ మెరిట్ స్కాలర్‌షిప్ పథకం విద్యార్థినులకు అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. వెంటనే అప్లై చేసి ప్రభుత్వ సహాయం పొందడానికి ఈ పథకాన్ని ఉపయోగించుకోండి.
ఇవి కూడా చదవండి :-
ఏపీ రైతులకు భారీ శుభవార్త: రూ.2 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు!
బోగస్ పింఛన్ల ఏరివేత 2025: ఏపీలో వైకల్య ధ్రువపత్రాల తనిఖీ ప్రక్రియ ప్రారంభం
AP Spouse Pensions: ఏపీలో వీరికి కొత్త పెన్షన్లు ఒక్కొక్కరికి రూ.4 వేలు
These scholarship is really great idea because these scholarship is more use than poor families
Ms arshiya