ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి
ఒక్కో బీసీ మహిళకు, యువతకు 24 వేల నుంచి 8 లక్షల వరకు ఆర్థిక సహాయం | BC Welfare Schemes
Table of Contents
BC Welfare Schemes: బీసీల కోసం స్వయం ఉపాధి పథకాలు. అవును నిజమే మీరు చూసినది అక్షరాల నిజమే. ఇక వివరాల్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం బీసీల కోసం ఉపాధి పథకాలను ప్రారంభించాలని నిశ్చయించుకుంది. పూర్తి వివరాల కోసం ఈ వ్యాసాన్ని చివరి వరకు చదవండి.
బీసీల ఉన్నతి కోసం కూటమి ప్రభుత్వం ప్రముఖంగా రెండు పథకాలను ప్రారంభించాలని నిశ్చయించుకుంది.
- కుట్టు మిషన్ పథకం 2
- జనరిక్ మందుల షాపుల ఏర్పాటు కొరకు ఆర్థిక సహాయం చేయడం
కుట్టుమిషన్ శిక్షణ మరియు పంపిణీ – BC Welfare Schemes
బీసీలకు స్వయం ఉపాధి కల్పనలో భాగంగా అర్హత గల అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఈ పథకాన్ని ప్రారంభించాలని అనుకుంటోంది. అందుకుగాను బీసీ సంక్షేమ శాఖ ఒక ప్రణాళికను సిద్ధం చేసి ముఖ్యమంత్రి అనుమతి కోసం పంపింది. సుమారు 80,000 మంది బీసీ/ఈబీసీ మహిళల కోసం ఈ పథకం ద్వారా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు శిక్షణ ఇచ్చేందుకు సంస్థలను టెండర్ల ద్వారా కూడా ఆహ్వానించారు. అర్హత గల మహిళలు ఈ స్వయం ఉపాధి పథకానికి అప్లై చేసుకోవడానికి ఓబిఎంఎస్ వెబ్సైట్ కూడా సిద్ధం చేస్తున్నారు.
- ఒక్కో మహిళలకు రోజుకు నాలుగు గంటలకు పాటు టైలరింగ్ లో శిక్షణ ఉంటుంది.
- అన్ని మండల కేంద్రాల్లో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
- శిక్షణ అనంతరం వారికి 24 వేల రూపాయల విలువచేసే కుట్టు మిషన్లను ఉచితంగా అందించనున్నారు.
జనరిక్ మందుల షాపు ఏర్పాటుకు ఆర్థిక సహాయం – BC Welfare Schemes
- అర్హత గల బీసీ/ ఈబీసీ మహిళలకు మరియు యువతకు జనరిక్ షాపులు ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని చేయడం
- ప్రతి మండల కేంద్రాల్లో ఒక షాపును ఏర్పాటు చేయడం
- డి ఫార్మా/బి ఫార్మసీ పూర్తి చేసిన యువతను ప్రోత్సహించడం
- షాపు ఏర్పాటుకు అవసరమైన ఎనిమిది లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయడం
- ఇందులో నాలుగు లక్షలు సబ్సిడీ గా నాలుగు లక్షల రుణంగా ఇప్పించడం
BC Welfare Schemes: ఈ పథకం నిర్వహణలో విధివిధానాలపై మంత్రి సవిత, డైరక్టర్ మల్లికార్జున్, ముఖ్య కార్యదర్శి పోలా భాస్కర్, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీ ఇప్పటికే పలు దపాలుగా సమావేశమై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్ లో 10th అర్హత తో కాంట్రాక్టు ఉద్యోగాలు
ఏపీలోని మహిళలకు ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు
Ela apply cheyali ceppandi
Very nice job thank you opportunity
Good morning sir Good job
Work from opportunity very nice job