ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి
Table of Contents
ఎన్టీఆర్ భరోసా పింఛన్: ఒక్కొక్కరికి రూ.4 వేలు, కొత్త నిర్ణయాలు, లబ్ధిదారులకు ప్రత్యేక సమాచారం | AP Spouse Pensions
AP Spouse Pensions: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చే దిశగా కీలక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా వితంతువుల పింఛన్ల కేటగిరీ (స్పౌజ్ కేటగిరీ)లో కొత్త పింఛన్‌ల మంజూరు, నెలవారీ పంపిణీ ప్రక్రియలో ప్రాధాన్యత కల్పించడం వంటి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ చర్యల ద్వారా వేలాది మంది లబ్ధిదారులు తక్షణ ప్రయోజనం పొందనున్నారు.
బీసీ యువతకు 4 లక్షలు మహిళలకు 24 వేలు ఉచితంగా పొందే అవకాశం
AP Spouse Pensions – ఎన్టీఆర్ భరోసా పింఛన్‌లో తాజా నిర్ణయాలు
- వితంతువుల పింఛన్ కేటగిరీ (స్పౌజ్ కేటగిరీ)
- భర్త చనిపోయిన వెంటనే భార్యకు పింఛన్ మంజూరు.
- ఇకపై 6-7 నెలలు వేచి ఉండకుండా, ఏ నెలకు ఆ నెలలోనే పింఛన్ మంజూరు.
- నవంబరు 1 నుంచి డిసెంబరు 15 వరకు 5,402 మంది వితంతువులకు కొత్త పింఛన్లు మంజూరు.
- వీరికి నెలకు రూ. 4,000 చొప్పున డిసెంబరు 31న పంపిణీ.
- పింఛన్ పంపిణీపై సులభతరం
- గత మూడు నెలలుగా పింఛన్ పొందలేని 50,000 మందికి ఆ మూడు నెలల మొత్తాన్ని ఒకేసారి డిసెంబరు 31న పంపిణీ.
- ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఈ పంపిణీ ప్రక్రియ జరగనుంది.
ఏపీలోని మహిళలకు ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు
AP Spouse Pensions – జనవరి 1కు బదులు డిసెంబరు 31న పింఛన్ పంపిణీ
- నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకొని, జనవరి 1కు బదులు డిసెంబరు 31న పింఛన్ పంపిణీ నిర్ణయం.
- రాష్ట్ర వ్యాప్తంగా 63.75 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 2,717.31 కోట్ల నిధులు బ్యాంకు ఖాతాలకు జమ.
- గ్రామ, వార్డు సచివాలయాలకు ప్రభుత్వ అదేశాలు జారీ.
పెన్షన్లు తొలగింపు పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఈ నిర్ణయాల వల్ల లబ్ది పొందేవారు
- వితంతువులకు తక్షణ సాయంగా పింఛన్.
- పింఛన్ మంజూరు కోసం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ.
- పింఛన్ పంపిణీలో నిర్ధిష్ట ప్రణాళిక, సమయపాలన.
పదో తరగతి పాస్ అయిన వారికి రైల్వేలో 32 వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలు పింఛన్ లబ్ధిదారులకు జీవితోపాధిలో భరోసా కలిగే విధంగా రూపొందించబడ్డాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మార్పులను ఆమోదించి పింఛన్ పంపిణీ పద్ధతిని మరింత పారదర్శకంగా తీర్చిదిద్దారు. ఈ చర్యలు వృద్ధుల, వితంతువుల సంక్షేమాన్ని పునరుద్ధరించడంలో కీలకపాత్ర పోషించనున్నాయి.
Sir B.c mahilalakyna O.C lo kuda poor family vunnaie avi kuda chudandi
What about BC and minorities sir…
Good decision…
Yes
No