ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి
రెవిన్యూ సదస్సుల్లో జరిగే ముఖ్య కార్యక్రమాలు – ప్రజల సమస్యల పరిష్కారం ఎలా? | AP Revenue Meetings | Telugu Time
రెవిన్యూ సదస్సులు గ్రామ స్థాయిలో ప్రజల భూసంబంధిత సమస్యలను పరిష్కరించే ముఖ్య వేదికలుగా నిలుస్తున్నాయి. ఈ సదస్సులు ద్వారా రెవెన్యూ, రిజిస్ట్రేషన్, అటవీ వంటి విభాగాల అధికారులు ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని పరిష్కరించే చర్యలు తీసుకుంటారు. భూస్వామ్యం, భూ కొలతలు, భూ కబ్జాలు, రికార్డుల్లో లోపాలు వంటి అనేక సమస్యలపై పిటిషన్లు స్వీకరించడం, వాటిని పరిష్కరించడం ఈ సదస్సుల ప్రధాన లక్ష్యంగా ఉంటుంది.
ఈ ఆర్టికల్లో రెవెన్యూ సదస్సుల్లో జరిగే ముఖ్య కార్యక్రమాలు, ప్రజలకు అందించే సేవలు, వాటి ద్వారా కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
1. భూముల మ్యాపింగ్ & ప్రకటనలు:
గ్రామ రెవెన్యూ మ్యాప్స్‌ను, ప్రభుత్వ భూములు, ప్రైవేట్ భూముల మ్యాప్స్‌ను సదస్సుల్లో ప్రకటిస్తారు.
2. అధికారుల హాజరు:
రెవెన్యూ, రిజిస్ట్రేషన్, అటవీ, దేవదాయ, వక్త్ర శాఖల మండల మరియు గ్రామస్థాయి అధికారులు సదస్సులకు హాజరై ప్రజల సమస్యలను వినిపిస్తారు.
3. భూసమస్యలపై పిటిషన్ల స్వీకరణ:
- భూ కొలతల్లో తేడాలు
- సర్వే నెంబర్లలో మార్పులు
- వారసుల పేర్ల నమోదు
- సరిహద్దు సమస్యలు
- రీసర్వే చేసిన గ్రామాల్లో తప్పుల నిర్ధారణ
- భూకబ్జాలు, ఆక్రమణలు
- నిషిద్ధ భూముల 22(ఏ) జాబితా నుండి భూముల తొలగింపు
4. డాక్యుమెంట్ల అందుబాటు:
ఎస్.ఎల్.ఆర్, అడంగల్, ఆర్ఆర్, 1-బి రిజిస్టర్, 22(ఏ) జాబితాలను ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచుతారు.
5. ఫిర్యాదుల పరిష్కారం:
- ప్రజల ఫిర్యాదులను స్వీకరించి, తహసీల్దార్ల నేతృత్వంలో భూములను పరిశీలిస్తారు.
- అవసరమైతే సర్వే చేయడం లేదా మళ్లీ రీసర్వే చేయడం జరుగుతుంది.
6. డిజిటల్ ప్రాసెస్:
- పిర్యాదులను ఆన్లైన్లో పొందుపరచడం.
- ఆర్టీజీఎస్ విభాగం వాటిని పర్యవేక్షిస్తుంది.
- పిర్యాదు చేసిన వ్యక్తులకు రశీదు అందజేస్తారు.
ఈ విధంగా రెవెన్యూ సదస్సులు ప్రజల భూసంబంధిత సమస్యల పరిష్కారానికి ముఖ్య వేదికగా ఉంటాయి.
ఏపీలో వారందరికీ పింఛన్లు రద్దు నోటీసులు జారీ మరియు పింఛను డబ్బులు రికవరీ
మీ చిన్నారికి ఆధార్ కార్డు లేదా? అయితే అంగన్వాడీ సెంటర్ కి వెళ్ళండి
నెలకు రూ.1.5 లక్షల పెన్షన్ కావాలా! అయితే ఈ ప్రభుత్వ పథకం పై ఓ లుక్కేయండి
ఇళ్లులేని పేదలకు బారి శుభవార్త ఉచితంగా ఇంటి స్థలాల పంపిణీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Tags: Revenue meets will be continued to resolve land disputes, says A.P. Transport Minister Ramprasad Reddy, భూ సమస్యలపై రేపట్నుంచి ఏపీ అంతట రెవిన్యూ సదస్సులు, Revenue meets to focus on solving land disputes in Andhra, త్వరపడండి! – నెల రోజుల్లో మీ భూ సమస్యకు పరిష్కారం, భూ వివాదాల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు – షెడ్యూల్ ఇదే, భూ వివాదాల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు – షెడ్యూల్ ఇదే, Revenue Meetings to Resolve Land Issues: Minister Dola, Revenue meetings empower citizens: , rikalahasti MLA, Revenue Sadassulu AP, Revenue sadassulu application form, Revenue sadassulu in telugu
PGRS login