ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి
ఆంధ్రప్రదేశ్ సంక్షేమ పథకాలు రద్దు: గంజాయి విక్రయించేవారిపై ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం
AP Welfare Schemes 2024: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాదకద్రవ్యాల నియంత్రణలో కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో గంజాయి తయారీ, రవాణా, విక్రయాలను నియంత్రించడానికి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా గంజాయి విక్రయించే కుటుంబాలకు సంబంధించిన సంక్షేమ పథకాలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కేబినెట్ సబ్ కమిటీ సమావేశం
బుధవారం హోం మంత్రి వంగలపూడి అనిత నేతృత్వంలో సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీ సభ్యులైన నారా లోకేష్, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు.
ఈ సమావేశంలో గంజాయి సాగు, రవాణా నియంత్రణపై చర్చించడంతో పాటు, గంజాయి విక్రయించే వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలు రద్దు చేయాలని ప్రతిపాదించారు.
AP Welfare Schemes – సంక్షేమ పథకాల రద్దు నిర్ణయం
ఈ సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు:
- గంజాయి విక్రయించే వారి కుటుంబాలకు ఆర్థిక సహాయ పథకాలు మరియు ఇతర సంక్షేమ పథకాల నుండి విరమణ.
- పాఠశాలలు, కళాశాలల పరిధిలో ఈగల్ కమిటీలను ఏర్పాటు చేసి, మాదకద్రవ్యాల వ్యతిరేక కార్యక్రమాలను చేపట్టడం.
- ఈ కమిటీల్లో ఆశావర్కర్లు, మహిళా సంఘాలను భాగస్వాములుగా చేర్చడం.
గంజాయి సాగు నియంత్రణ చర్యలు
రాష్ట్రంలో గంజాయి సాగు ఎక్కువగా ఉన్న మన్యం ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహం కోసం:
- ప్రత్యామ్నాయ పంటల వివరాలు: లాభదాయకమైన పంటలు పండించేందుకు ప్రభుత్వం ప్రోత్సాహం.
- విత్తనాల పంపిణీ: అవసరమైన విత్తనాలు ఉచితంగా అందజేయడం.
- డ్రోన్ కెమెరాల వినియోగం: గంజాయి సాగు ఉన్న ప్రాంతాలను గుర్తించడం.
మాదకద్రవ్యాల నియంత్రణ కోసం ‘ఈగల్’ టాస్క్ ఫోర్స్
ఏపీ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్‌ను ఈగల్ గా నామకరణం చేసి, ఆ టాస్క్ ఫోర్స్ విధివిధానాలను కూడా ప్రభుత్వం చర్చించింది.
సమాజంపై ప్రభావం
ఈ నిర్ణయంతో మాదకద్రవ్యాల వినియోగం, గంజాయి రవాణా తగ్గేందుకు ప్రభుత్వానికి సహకారం లభిస్తుందని అధికారులు నమ్మకం వ్యక్తం చేశారు. గంజాయి విక్రయించే కుటుంబాలకు సంక్షేమ పథకాలు రద్దు చేస్తే, వారు మార్గం మళ్లించేందుకు ఆసక్తి చూపుతారని అంచనా.
నిజమైన మార్పు కోసం ప్రభుత్వ కృషి
మాదకద్రవ్యాల నియంత్రణలో ఈ నిర్ణయం ఒక దశ అని ప్రభుత్వం పేర్కొంటోంది. గంజాయి సాగు, విక్రయాలకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయడమే ప్రభుత్వ తుదిలక్ష్యం.
మంచి నిర్ణయం ప్రత్యేన్యం పంటలు పండించుకోడానికి
సర్ మీరు తీసుకున్న నిర్ణయం అయితే మంచిది కానీ నాదొక ఆలోచన అవి పండించే వారు కూడాను ఒకరైతే కాబట్టి వాటిని వినియోగించే వారికి ఏ పథకాలు లేకుండా చేస్తే మంచిది ఎందుకంటే మన రాష్ట్రంలో ఉత్పత్తి లేకపోతే వేరే ప్రాంతం నుంచి తెప్పించుకోవచ్చు వినియోగించేవాడు ఏదైనా ఎత్తైన ఎక్కడైనా ఉపయోగించుకుంటాడు వినియోగించువాడు లేకుంటే ఉత్పత్తి అనేది జరగదు దీన్ని పరిగణలో తీసుకోగలరని ఆశిస్తూ
మీ
శ్రేయోభిలాషి
Very good very nice 👍
మంచి నిర్ణయం గంజాయి వినియోగిస్తూ దొరికితే పనిష్మెంట్ కఠినతరం చెయ్యండి ఆంధ్రప్రదేశ్నీ గంజాయి వనం చేసిన దుర్మార్గులను కూడా వదలకండి …