ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా రాయితీపైన 4074 పాసెంజర్ ఆటోలు | 4074 Passenger Autos On Concession
Table of Contents
4074 Passenger Autos On Concession: ఆంధ్ర ప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం దళితులకు స్థిరమైన ఆదాయాన్ని సమకూర్చే విధంగా మరో ప్రయత్నం చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వ పథకమైన “పీఎం అజయ్” మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకమైన “ఉన్నతి“తో జత చేసి ప్యాసింజర్ ఆటోలను, వ్యవసాయ పరికరాలను రాయితీపై ఇవ్వాలని నిర్ణయించుకుంది. దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలను కూడా విడుదల చేసింది.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు పై ప్రభుత్వం తాజా ప్రకటన..!!
పీఎం అజయ్ మరియు ఉన్నతి పథక వివరాలు | 4074 Passenger Autos On Concession
రాష్ట్రవ్యాప్తంగా సుమారుగా 4074 ప్యాసింజర్ ఆటోలను లబ్ధిదారులకు ఇవ్వాలని వాటి సేకరణకు గాను టెండర్ కమిటీలను కూడా ప్రభుత్వం ప్రారంభించింది. ఇందుకుగాను ప్రభుత్వానికి రూ.122 కోట్ల రూపాయ ల ఖర్చు అవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ పథకం కింద రూ.1.50 లక్షల విలువ గల వ్యవసాయ పరికరాలు కూడా రాయితీ కింద ఇవ్వనున్నారు. స్ప్రేయర్లు, మోటార్ ఇంజన్లు, బోర్ డ్రిల్లర్లు, మోటార్ రివైండింగ్ మిషన్లు తదితర వస్తువులను ఈ పథకం కింద ఇవ్వనున్నారు.రాష్ట్రవ్యాప్తంగా 2065 మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది.
AP New Houses 2024: కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్
రాయితీ వివరాలు | 4074 Passenger Autos On Concession
ఇందులో కూడా 50% రాయితీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వనుండగా 10% లబ్ధిదారిని వాటాగా నిర్ణయించారు. మిగిలిన వాటాను బ్యాంకు ద్వారా వడ్డీ లేని రుణాలుగా ఇవ్వనున్నారు.
- ఒక్కో వాహనం ఖరీదు రూ.3 లక్షల రూపాయలు
- రాష్ట్ర ప్రభుత్వ రాయితీ రూ.లక్ష రూపాయలు
- కేంద్ర ప్రభుత్వ రాయితీ రూ.50,000 రూపాయలు
- లబ్ధిదారుని వాట పది శాతం అంటే 30 వేల రూపాయలు
ఉన్నతి పథకం ద్వారా వడ్డీ లేని రుణం | 4074 Passenger Autos On Concession
ఈ పథకానికి ఎన్నికైన లబ్ధిదారులకు ఇప్పటివరకు బ్యాంకుల ద్వారా అప్పులు ఇప్పించి నెలసరి వాయిదాల రూపంలో చెల్లింపులు చేసే విధానం అమల్లో ఉంది. దళితులపై వడ్డీ భారం లేకుండా ప్రభుత్వం నిర్ణయించుకుని బ్యాంకుల ద్వారా వారికి ఆటోలు మరియు వ్యవసాయ పరికరాలు తీసుకోవడానికి అవసరమైన రుణాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ పథకాన్ని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (SERP) లోకి అనుసంధించాలని నిర్ణయించారు. దీని కింద డ్వాక్రా సంఘాలలోని ఎస్సీ మహిళలు కూడా వడ్డీ లేని రుణాలు అందించనున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న రాయితీ మరియు లబ్ధిదారిన వాటా ఫోను మిగతా రూ.1,35 వేల రూపాయల వ్యయాన్ని బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాల ద్వారా పొందవచ్చు.
డ్వాక్రా మహిళలకు భారీగా ఉద్యోగాలు త్వరలో నోటిఫికేషన్ విడుదల పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి
ఇంతకన్నా గొప్ప వార్త ఇంకేం కావాలి కావున అర్హత గల లబ్ధిదారులు మీ సమీపంలోని SERP కార్యాలయంలో అప్లికేషన్ సమర్పించి ఆటోలు మరియు వ్యవసాయ పరికరాలు పొందగలరని ఆశిస్తున్నాము.
Official web Site – Click Here
పెన్షన్లు తొలగింపు పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
పదో తరగతి పాస్ అయిన వారికి రైల్వేలో 32 వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు
ఏపీలో ఉచిత కుట్టుమిషన్ల పథకం – ట్రైనింగ్ మరియు ఉచిత కుట్టు మిషన్లు ఎలా పొందాలి?
Auto
DEAR SIR IN 6TH STEP LO ELECTRIC BILL AND HOUSE SQUARE FET IT’S PROFITS TO OUR GOVERNMENT SO YOU PLEASE REMOVE IN 6TH STEP IN VERIFICATION ME KARYAKARTHA KALADHAR
G Giddakka
ఆటోడ్రైవర్